Day 1 · October 11, 2026, Sunday
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి · Ashwayuja Suddha Padyami
శరన్నవరాత్రి మహోత్సవములలో మొదటిరోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ బాలాత్రిపురసుందరీదేవి గా దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లో ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు.
Sri Kanaka Durgamma adorns the form of Sri Bala Tripura Sundari Devi. She is the fundamental deity of the Sri Chakra (First Amnaya).
మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలోఉండే మొదటి దేవత శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే శ్రీ మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి.
In Sri Vidya Upasana, the Bala Mantra is the first mantra imparted to devotees. Seeking Her grace is essential to obtaining the blessings of Sri Maha Tripura Sundari Devi.
మొదటిరోజు తెల్లవారుఝామున స్నపనాభిషేకం, అనంతరం శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనం లభించును.
Snapana Abhishekam in the early morning. Goddess will bless devotees as Sri Bala Tripura Sundari Devi. Darshan: 8:00 AM to 11:00 PM.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం నిర్వహించబడును.
Procession (Nagarotsavam) of Sri Durga Malleswara Swamy Varlu.
11 అక్టోబర్, ఆదివారం – శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారం.
On Sunday, October 11 2026, day 1 of Vijayawada Dasara 2026, the alankaram is Sri Bala Tripura Sundari Devi.
దర్శనం: ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు (తెల్లవారుఝామున స్నపనాభిషేకం అనంతరం).
Darshan: 8:00 AM to 11:00 PM (after the early-morning Snapana Abhishekam).
నగరోత్సవం (ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో).
Nagarotsavam (Every evening, Pradosha Kalam).
Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada