Sri Durga Malleswara Swamy Varla Devasthanam · Indrakeeladri, Vijayawada, Andhra Pradesh · October 11–October 20, 2026
ఇంద్రకీలాద్రిపై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి (11 అక్టోబర్ 2026, ఆదివారం) నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి (20 అక్టోబర్ 2026, మంగళవారం) వరకు శరన్నవరాత్రి మహోత్సవములు. ప్రతిరోజూ శ్రీ కనకదుర్గమ్మవారు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు.
Sharannavaratri Mahotsavams at Indrakeeladri, from Ashwayuja Suddha Padyami (Sunday, 11 October 2026) to Ashwayuja Suddha Dashami (Tuesday, 20 October 2026). Each day Sri Kanaka Durgamma gives darshan in a different alankaram.
పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిన భారతదేశంలోని ప్రధాన శక్తిక్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రము విశిష్టమైనది, మహిమాన్వితమైనది. పరమపావన కృష్ణానదీతీరంలో ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ మల్లేశ్వరస్వామివారు స్వయంగా అవతరించటం విశేషం. ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి శిలను పవిత్రంగా, ప్రతి వృక్షాన్ని కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు. వేదమంత్రాలతో, స్తోత్రాలతో భక్తులుగావించే శ్రీ దుర్గామల్లేశ్వరుల దివ్యనామస్మరణలతో ఇంద్రకీలాద్రిక్షేత్రం అపరకైలాసంగా వెలుగొందుతున్నది.
Among the prominent Shakti Temples in India, the sacred Indrakeeladri Kshetram in Vijayawada is exceptionally divine and revered. Situated on the banks of the holy Krishna River, Indrakeeladri is the sacred abode where Sri Kanaka Durga Devi and Sri Malleswara Swamy manifested as Self-Manifested (Swayambhu) deities. Every stone on this hill is venerated as sacred, and every tree is revered as a Kalpavriksha.
శ్రీ అమ్మవారి మహిమను తెలుసుకున్న కీలుడనే యక్షుడు ఘోరతపస్సు చేయగా, అతని భక్తికి మెచ్చి శ్రీ అమ్మవారు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా, 'పరాశక్తి అయిన మీరు నా హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని' వరం అడుగగా శ్రీఅమ్మవారు కీలునితో నీవు అద్రి(కొండ) రూపంలో ఉండమని త్వరలోనే ఈ అద్రిపై స్వయంభువుగా ఆవిర్భవిస్తానని వరమిచ్చి అనుగ్రహించింది. కీలుడు ఆనందభరితుడై అద్రిగామారగా, కొంతకాలానికి దుర్గమాసురుడిని వధించిన ఆదిపరాశక్తి కీలాద్రికి వచ్చి దుర్గాదేవిగా వెలసింది. విజయవాడనగరమును పరిపాలిస్తున్న మాధవవర్మ ధర్మనిరతికి మెచ్చిన దుర్గాదేవి కనకవర్షం కురిపించి శ్రీ కనకదుర్గాదేవిగా కీర్తించబడుచున్నది. ఇంద్రుడు శ్రీఅమ్మవారి దర్శనమునకు మొదటగా రావటం వలన ఈ పర్వతం ఆనాటి నుండి ఇంద్రకీలాద్రిగా ప్రాచుర్యాన్ని పొందిందని ప్రతీతి.
Impressed by the intense penance of a Yaksha named Keela, Goddess Parashakti granted him a boon. Keela prayed for the Goddess to reside in his heart forever. The Goddess instructed Keela to assume the form of a mountain (Adri), promising that She would manifest upon him in due time. Keela transformed into the mountain, which came to be known as Keeladri. Later, after slaying the demon Durgamasura, Goddess Adi Parashakti settled on Keeladri as Durga Devi. When King Madhava Verma of Vijayawada demonstrated supreme righteousness, Goddess Durga showered a rain of gold (Kanaka Varsham), earning Her the divine name Sri Kanaka Durga Devi. As Lord Indra was the first to arrive for the Goddess's darshan, the hill became widely renowned as Indrakeeladri.
దుర్గమాసుర సంహారం చేసిన అనంతరం శ్రీదుర్గాదేవి ఉగ్రరూపంతో ఉండటం గ్రహించిన జగద్గురు శ్రీఆదిశంకరాచార్యుల వారు దుర్గమ్మను భక్తులపాలిట కల్పవల్లిగా, శాంతస్వరూపిణిగా ఉంచాలని భావించి శ్రీఅమ్మవారి పాదాలచెంత శ్రీచక్ర ప్రతిష్ఠాపనచేసి వైదికపరమైన స్తోత్రాలతో శ్రీసూక్త విధానంలో కుంకుమతో పూజలు నిర్దేశం చేయగా, ఆనాటి నుండి శ్రీఅమ్మవారికి శ్రీ ఆదిశంకరులు నిర్దేశం ప్రకారం అవిచ్ఛిన్నంగా పూజలు నిర్వహించబడుచున్నాయి. తరతరాలుగా ఇంద్రకీలాద్రి క్షేత్రంపై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు శరన్నవరాత్రులు శ్రీఅమ్మవారికి అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. విజయదశమి పర్వదినమున శ్రీ దుర్గామల్లేశ్వరులు కృష్ణానదిలో హంసవాహనంపై జలవిహారం చేస్తారు.
To appease the fierce form of Durga Devi after the slaying of Durgamasura, Jagadguru Sri Adi Shankaracharya consecrated the sacred Sri Chakra at the feet of the Goddess, transforming Her into a peaceful, benevolent bestower of blessings (Kalpavalli). He ordained Vaidika Sri Sukta rituals with Kumkum worship, which are meticulously followed to this day. Every year from Ashwayuja Shuddha Padyami to Dashami, Sharannavaratri Mahotsavams are celebrated with grand devotion. On Vijayadashami, Sri Durga Malleswara Swamy Varlu go on a divine water procession on a Swan-shaped boat (Hamsa Vahanam) in the Krishna River.
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవములు 11 అక్టోబర్ 2026 (ఆదివారం, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి) నుండి 20 అక్టోబర్ 2026 (మంగళవారం, విజయదశమి) వరకు జరుగుతాయి.
Dasara Mahotsavam 2026 at Indrakeeladri runs from Sunday, 11 October 2026 (Ashwayuja Suddha Padyami) to Tuesday, 20 October 2026 (Vijayadashami).
11 అక్టోబర్ ఉదయం 8 నుండి రాత్రి 11 వరకు (స్నపనాభిషేకం అనంతరం). 12 నుండి 20 అక్టోబర్ వరకు ఉదయం 4 నుండి రాత్రి 11 వరకు. మూలానక్షత్రం (16 అక్టోబర్) రోజున ఉదయం 3 నుండి రాత్రి 11 వరకు.
On 11 October darshan is from 8:00 AM to 11:00 PM after the early-morning Snapana Abhishekam. From 12 to 20 October darshan is from 4:00 AM to 11:00 PM. On Moola Nakshatram (16 October) darshan is from 3:00 AM to 11:00 PM.
మూలానక్షత్రం 16 అక్టోబర్ 2026, శుక్రవారం. ఆ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు.
Moola Nakshatram falls on Friday, 16 October 2026, when the Goddess appears as Sri Saraswati Devi.
హంసవాహన తెప్పోత్సవం విజయదశమి, 20 అక్టోబర్ 2026 మంగళవారం సాయంత్రం 5 గంటలకు.
The Hamsa Vahana Teppotsavam on the Krishna River is on Vijayadashami, Tuesday 20 October 2026, from 5:00 PM.
Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada