Day 2 · October 12, 2026, Monday
ఆశ్వయుజ శుద్ధ విదియ · Ashwayuja Suddha Vidiya
శరన్నవరాత్రి మహోత్సవములలో రెండవరోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీగాయత్రీ దేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తూ ఉండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీ దేవి వెలుగొందుతున్నది.
The Goddess appears as Sri Gayatri Devi, the Veda Mata and source of all mantras. She is depicted with five faces representing Pearl, Coral, Gold, Sapphire, and White hues.
సమస్త దేవతామంత్రాలకీ గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీమంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీ మాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు.
She bestows health, wisdom, and success in all spiritual practices (Mantra Siddhi).
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం నిర్వహించబడును.
Procession (Nagarotsavam) of Sri Durga Malleswara Swamy Varlu.
12 అక్టోబర్, సోమవారం – శ్రీ గాయత్రీ దేవి అలంకారం.
On Monday, October 12 2026, day 2 of Vijayawada Dasara 2026, the alankaram is Sri Gayatri Devi.
దర్శనం: ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.
Darshan: 4:00 AM to 11:00 PM.
నగరోత్సవం (ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో).
Nagarotsavam (Every evening, Pradosha Kalam).
Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada