Day 5 · October 15, 2026, Thursday
ఆశ్వయుజ శుద్ధ పంచమి · Ashwayuja Suddha Panchami
శరన్నవరాత్రి మహోత్సవములలో ఐదవరోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ లలితాత్రిపురసుందరీ దేవి గా దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహా మంత్రాధి దేవతగా వేంచేసి, ఆరాధించే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నది.
The presiding deity of the Sri Chakra and the Panchadashakshari Mantra, Sri Lalitha Tripura Sundari Devi appears holding sugarcane in Her hand, flanked by Sri Lakshmi Devi and Sri Saraswati Devi.
శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్యరూపిణిగా చెరకు గడను చేతపట్టుకొని, మహాకామేశ్వరాంకయై, శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహా కామేశ్వరుడిగా, శ్రీఅమ్మవారు మహాత్రిపురసుందరీదేవిగా పూజలందుకుంటున్నారు.
She bestows maternal love, harmony, and ultimate spiritual grace.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం నిర్వహించబడును.
Procession (Nagarotsavam) of Sri Durga Malleswara Swamy Varlu.
15 అక్టోబర్, గురువారం – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం.
On Thursday, October 15 2026, day 5 of Vijayawada Dasara 2026, the alankaram is Sri Lalitha Tripura Sundari Devi.
దర్శనం: ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.
Darshan: 4:00 AM to 11:00 PM.
నగరోత్సవం (ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో).
Nagarotsavam (Every evening, Pradosha Kalam).
Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada