Day 6 · October 16, 2026, Friday · Moola Nakshatram
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి · Ashwayuja Suddha Shashti
శరన్నవరాత్రి మహోత్సవములలో ఆరవరోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతీ దేవి గా అలంకారములో దర్శనమిస్తారు. మూలా నక్షత్రం శ్రీఅమ్మవారి జన్మనక్షత్రము. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్టసంహారం చేసిన శ్రీదుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలానక్షత్రం రోజున వాగ్దేవతా మూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు.
Coinciding with Her birth star (Moola Nakshatram), Sri Durgamma appears as Sri Saraswati Devi, the Goddess of Wisdom and Learning.
సరస్వతీదేవిని సేవించడం వలన విద్యార్థినీ విద్యార్థులు సర్వ విద్యలలో విజయం పొందుతారు. మూలా నక్షత్రం నుండి విజయ దశమివరకు విశేష పుణ్య దినాలుగా భావించి భక్తులు శ్రీదుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకము.
Students and seekers worship Her on this sacred day for success in education and enlightenment.
మూలానక్షత్రం రోజున ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో శ్రీ అమ్మవారి దర్శనం లభించును.
On Moola Nakshatram the Goddess will appear as Sri Saraswati Devi. Special darshan timings: 3:00 AM to 11:00 PM.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్రశ్రేయస్సు కోరుతూ శ్రీ కనకదుర్గమ్మవారికి రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Hon'ble Chief Minister of Andhra Pradesh Sri Nara Chandrababu Naidu Garu will present Pattu Vastrams to Sri Kanaka Durgamma on behalf of the Government of Andhra Pradesh for the welfare of the State.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం నిర్వహించబడును.
Procession (Nagarotsavam) of Sri Durga Malleswara Swamy Varlu.
16 అక్టోబర్, శుక్రవారం (మూలానక్షత్రం) – శ్రీ సరస్వతీ దేవి అలంకారం.
On Friday, October 16 2026 (Moola Nakshatram), day 6 of Vijayawada Dasara 2026, the alankaram is Sri Saraswati Devi.
దర్శనం (మూలానక్షత్రం): ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.
Darshan (Moola Nakshatram): 3:00 AM to 11:00 PM.
రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ (సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు); నగరోత్సవం (ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో).
Presentation of Pattu Vastrams on behalf of the Government of Andhra Pradesh (4:30 PM to 5:30 PM); Nagarotsavam (Every evening, Pradosha Kalam).
Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada