Day 9 · October 19, 2026, Monday · Mahanavami
ఆశ్వయుజ శుద్ధ నవమి · Ashwayuja Suddha Navami
శరన్నవరాత్రి మహోత్సవములలో తొమ్మిదవరోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహిషాసురమర్దినీదేవి గా దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది.
Adorned with eight arms and riding a lion, Goddess Durga appears as Sri Mahisasura Mardini Devi, the slayer of Mahishasura.
మహిషాసుర మర్దినీదేవి అలంకారములో ఉన్న శ్రీఅమ్మవారిని దర్శించడం వలన అరిషడ్వర్గాలు నశిస్తాయి, తత్ఫలితంగా సాత్వికభావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.
Seeking Her darshan destroys inner vices (Arishadvargas), instills courage, and grants triumph.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం నిర్వహించబడును.
Procession (Nagarotsavam) of Sri Durga Malleswara Swamy Varlu.
19 అక్టోబర్, సోమవారం (మహానవమి) – శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకారం.
On Monday, October 19 2026 (Mahanavami), day 9 of Vijayawada Dasara 2026, the alankaram is Sri Mahisasura Mardini Devi.
దర్శనం: ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.
Darshan: 4:00 AM to 11:00 PM.
నగరోత్సవం (ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో).
Nagarotsavam (Every evening, Pradosha Kalam).
Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada